పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించాలని ఆకాంక్షిస్తూ, బలూచ్ వేర్పాటువాద సంస్థలు, నాయకులు ఆగస్టు 11ను ‘బలూచిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం’గా ప్రకటించారు. తమను పాకిస్తాన్‌లో భాగంగా కాకుండా, ఒక సార్వభౌమ దేశంగా గుర్తించాలని వారు ఐక్యరాజ్యసమితిని, ప్రపంచ దేశాలను కోరుతున్నారు. అయితే, ఇప్పటివరకు ఐక్యరాజ్యసమితి కానీ, భారతదేశం సహా మరే ఇతర దేశం కానీ బలూచిస్తాన్‌ను ఒక స్వతంత్ర దేశంగా అధికారికంగా గుర్తించలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో, నూతనంగా ఏర్పాటైందని చెబుతున్న బలూచిస్తాన్ ప్రభుత్వం సనాతన [...]
The post హిందూ దేవుళ్లను కీర్తిస్తూ బలూచిస్తాన్ జాతీయ గీతాన్ని రూపొందించారంటూ షేర్ చేస్తున్న ఈ వీడియో AI వాడి తయారు చేసింది appeared first on FACTLY.
పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించాలని ఆకాంక్షిస్తూ, బలూచ్ వేర్పాటువాద సంస్థలు, నాయకులు ఆగస్టు 11ను ‘బలూచిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం’గా ప్రకటించారు. తమను పాకిస్తాన్‌లో భాగంగా కాకుండా, ఒక సార్వభౌమ దేశంగా గుర్తించాలని వారు ఐక్యరాజ్యసమితిని, ప్రపంచ దేశాలను కోరుతున్నారు. అయితే, ఇప్పటివరకు ఐక్యరాజ్యసమితి కానీ, భారతదేశం సహా మరే ఇతర దేశం కానీ బలూచిస్తాన్‌ను ఒక స్వతంత్ర దేశంగా అధికారికంగా గుర్తించలేదు.
ఈ పరిణామాల నేపథ్యంలో, నూతనంగా ఏర్పాటైందని చెబుతున్న బలూచిస్తాన్ ప్రభుత్వం సనాతన ధర్మ దేవుళ్లను కీర్తిస్తూ జాతీయ గీతాన్ని ఆవిష్కరించిందంటూ ఒక వీడియో (ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
ఆర్కైవ్ పోస్టుని ఇక్కడ చూడవచ్చు
క్లెయిమ్: భారతదేశ సనాతన ధర్మ దేవుళ్లను కీర్తిస్తూ బలూచిస్తాన్ రూపొందించిన జాతీయ గీతానికి సంబంధించిన వీడియో.
ఫాక్ట్: వైరల్ వీడియోలోని గీతం బలూచిస్తాన్ జాతీయ గీతంగా ఎక్కడా ప్రకటించబడలేదు. “Beyond Conscious” అనే యూట్యూబ్ ఛానల్ వారు AIతో ఈ గీతాన్ని సృష్టించారు. అంతేకాకుండా, ఇప్పటివరకు ఐక్యరాజ్యసమితి కానీ, భారతదేశం సహా మరే ఇతర దేశం కానీ బలూచిస్తాన్‌ను ఒక స్వతంత్ర దేశంగా అధికారికంగా గుర్తించలేదు. కావున, పోస్టులో చేయబడిన క్లెయిమ్ తప్పు.
ముందుగా ఈ విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, వైరల్ వీడియోలో ఉన్న గీతాన్ని తమ జాతీయ గీతంగా బలూచ్ వేర్పాటువాద సంస్థలు గానీ, నాయకులు గానీ ప్రకటించినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు. అలాగే, జాతీయ, అంతర్జాతీయ ప్రధాన మీడియాలో కూడా దీనికి సంబంధించి ఎలాంటి వార్తలు రిపోర్ట్ కాలేదు.
ఇక, వైరల్ వీడియోలోని దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, దీనికి సంబంధించిన అసలైన వీడియోను “Beyond Conscious” అనే యూట్యూబ్ ఛానల్ 18 జూలై 2026న అప్‌లోడ్ (ఆర్కైవ్) చేసినట్లు గుర్తించాం. ఈ పాటలోని దృశ్యాలు, సంగీతం, గాత్రం అన్నీ కూడా కృత్రిమ మేధ (AI) సాయంతో సృష్టించినట్లు ఆ ఛానల్ పేర్కొంది. అదనంగా, SynthID, Hive వంటి AI డిటెక్షన్ టూల్స్ కూడా ఈ వీడియో పూర్తిగా AIతో రూపొందించినట్లుగా నిర్ధారించాయి. అలాగే, ఈ ఛానల్‌ను పరిశీలించగా ఇందులో వివిధ హిందూ దేవళ్లకు సంబంధించిన గీతాలను (ఇక్కడ & ఇక్కడ) AIతో రూపొందించినట్లుగా గుర్తించాం.
భౌగోళికంగా పాకిస్తాన్‌లో అతిపెద్ద ప్రావిన్స్ అయిన బలూచిస్తాన్, అభివృద్ధిలో మాత్రం వెనుకబడి ఉంది. తమ అపారమైన సహజ వనరులను పాక్ ప్రభుత్వం దోచుకుంటూ, అక్రమ అరెస్టులు, అణచివేతలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ‘బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ’ (BLA) వంటి సంస్థలు దశాబ్దాలుగా సాయుధ పోరాటం చేస్తున్నాయి. ఇటీవల కాలంలో ఈ పోరాటం మరింత తీవ్రమైంది. ముఖ్యంగా ‘చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్’ (CPEC) ప్రాజెక్టుల ద్వారా చైనా తమ వనరులను కొల్లగొడుతోందని బలూచ్ వేర్పాటువాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2024-26 మధ్య కాలంలో పాక్ సైన్యం, చైనా జాతీయులే లక్ష్యంగా భారీ దాడులు జరగడం, దానికి ప్రతికారంగా పాక్ సైన్యం కఠిన ఆపరేషన్లు చేపట్టడంతో అక్కడ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి.
ఇక సోషల్ మీడియాలో ‘బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది’ అనే ప్రచారానికి ప్రధాన కారణం ఆగస్టు 11వ తేదీకి ఉన్న చారిత్రక నేపథ్యం. 1947 ఆగస్టు 11న అప్పటి ‘కలాత్ సంస్థానం’ (ప్రస్తుత బలూచిస్తాన్) బ్రిటిష్ పాలన నుండి స్వతంత్ర రాజ్యంగా ఏర్పడి, ఆ తర్వాత 1948లో పాకిస్తాన్‌లో విలీనం చేయబడింది. దీనిని వ్యతిరేకిస్తూ ఏటా ఆగస్టు 11న బలూచ్ వేర్పాటువాద సంస్థలు లాంఛనప్రాయంగా తమ ‘స్వాతంత్ర్య దినోత్సవం’ జరుపుకుంటూ ప్రకటనలు చేస్తుంటాయి. అయితే, ఐక్యరాజ్యసమితి గానీ, భారతదేశం సహా మరే ఇతర దేశం గానీ దీనిని స్వతంత్ర దేశంగా అధికారికంగా గుర్తించలేదు.
చివరిగా, హిందూ దేవుళ్లను కీర్తిస్తూ బలూచిస్తాన్ తమ జాతీయ గీతాన్ని రూపొందించారంటూ షేర్ చేస్తున్న ఈ వీడియో AI వాడి తయారు చేసింది.
| # | Наименование новости | Тональность | Информативность | Дата публикации |
|---|---|---|---|---|
| 1 | Индия назвала ложными сообщения СМИ Пакистана о поднятии белого флага военными | 0 | 0 | 07-05-2025 |
| 2 | В Афганистане уничтожили главаря белуджских сепаратистов Пакистана | 0 | 0 | 28-05-2021 |
| 3 | Pakistan defence minister declares 'open war' with Afghanistan after explosions heard in Kabul in latest escalation of violence | 0 | 5.63 | 27-02-2026 |
| 4 | МИД Пакистана опроверг заявления об обстреле Амритсара | 0 | 0 | 08-05-2025 |
| 5 | Texas woman among climbers killed in avalanche on Pakistan's Broad Peak | 0 | 8.42 | 31-07-2026 |
| 6 | В Пакистане считают Афганистан и Индию причастными к взрыву автобуса с китайцами | 0 | 0 | 12-08-2021 |
| 7 | Any country including Iran can join Mecca Pact, Pakistani ambassador says | 0 | 10 | 13-08-2026 |
| 8 | Pakistan introduces sweeping rules to restrict foreign media amid Kashmir unrest | 0 | 9.17 | 06-08-2026 |
| 9 | UK opposition demands Pakistan aid freeze over child sex predator | -2 | 3 | 19-07-2026 |