స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘గాడ్ ఆఫ్ వార్’. పైగా ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత’ తర్వాత త్రివిక్రమ్ చేస్తున్న సినిమా ఇదే. ఐతే, ఈ సినిమాకి పోటీగా ధనుష్ – వెట్రిమారన్ కలయికలో ‘తమిళ్ మురుగన్’ రాబోతుంది. రెండు చిత్రాలు సుబ్రహ్మణ్య స్వామి కథ ఆధారంగా తెరకెక్కనున్నాయి. పైగా రెండు చిత్రాల్లో కథా గమనం ఒకేలా ఉండబోతుందని టాక్. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రాక్షసుల పై సుబ్రహ్మణ్య స్వామి చేసిన యుద్ధాల నేపథ్యమే ప్రధాన […]
The post ‘గాడ్ ఆఫ్ వార్’లో వాటి పై త్రివిక్రమ్ ఫోకస్ ! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.
Published on Jul 13, 2026 7:01 AM IST
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘గాడ్ ఆఫ్ వార్’. పైగా ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత’ తర్వాత త్రివిక్రమ్ చేస్తున్న సినిమా ఇదే. ఐతే, ఈ సినిమాకి పోటీగా ధనుష్ – వెట్రిమారన్ కలయికలో ‘తమిళ్ మురుగన్’ రాబోతుంది. రెండు చిత్రాలు సుబ్రహ్మణ్య స్వామి కథ ఆధారంగా తెరకెక్కనున్నాయి. పైగా రెండు చిత్రాల్లో కథా గమనం ఒకేలా ఉండబోతుందని టాక్. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రాక్షసుల పై సుబ్రహ్మణ్య స్వామి చేసిన యుద్ధాల నేపథ్యమే ప్రధాన కథాంశం. ఇప్పుడున్న అప్ డేట్ ప్రకారం.. ‘తమిళ్ మురుగన్’ ముందు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
అందుకే, త్రివిక్రమ్ తన స్క్రిప్ట్ పై మళ్లీ ఫోకస్ పెట్టాడట. సుబ్రహ్మణ్య స్వామి కథతో పాటు.. సుబ్రహ్మణ్య స్వామి పాత్రలోని దైవత్వాన్ని బలంగా చూపించే విధంగా త్రివిక్రమ్ ప్రస్తుతం స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నట్లు టాక్. కాగా ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం అత్యంత భారీ స్థాయిలో రూపొందుతోంది.
ఇక నటీనటులు మరియు సాంకేతిక బృందానికి సంబంధించిన మరిన్ని వివరాలు రాబోయే రోజుల్లో వెల్లడి కానున్నాయి. ఈ భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీగా బజ్ క్రియేట్ అయింది.
| # | Наименование новости | Тональность | Информативность | Дата публикации |
|---|---|---|---|---|
| 1 | ‘కొరియన్ కనకరాజు’ టీజర్ అప్డేట్ ఇచ్చిన థమన్! | 0 | 5 | 12-07-2026 |
| 2 | ట్రైలర్ టాక్: బ్యూటిఫుల్ లవ్ స్టోరీ.. సాలిడ్ యాక్షన్, ఎమోషన్స్ తో ప్రామిసింగ్ గా ‘శ్రీనివాస మంగాపురం’ | 5 | 6 | 12-07-2026 |
| 3 | Dhurandhar: అక్కడ డిజాస్టర్ స్టార్ట్ తో ‘ధురంధర్’.. షాకింగ్ రెస్పాన్స్ తో అవాక్కవుతున్న ఫ్యాన్స్ | -5 | 3 | 12-07-2026 |
| 4 | పిక్ టాక్: ట్రీట్మెంట్ తర్వాత పవన్ తో చంద్రబాబు! | 0 | 3 | 12-07-2026 |
| 5 | Maa Inti Bangaram OTT: సామ్ 100 కోట్ల బ్లాక్ బస్టర్ కి ఓటిటి డేట్ వచ్చేసింది! | 5 | 6 | 12-07-2026 |
| 6 | చరిత్ర సృష్టించిన సమంత.. మొదటి 100 కోట్ల నటిగా రేర్ రికార్డు! | 5 | 6 | 12-07-2026 |
| 7 | అక్కడ హాఫ్ మిలియన్ కి దగ్గరలో ‘లెనిన్’ ర్యాంపేజ్! | 6 | 7 | 12-07-2026 |
| 8 | Съемки военной драмы о событиях в Москве в 1941 году начнутся в августе | 0 | 0 | 08-03-2023 |
| 9 | విజయ్ ‘రణబాలి’ పై రష్మిక ఎగ్జైటింగ్ పోస్ట్ వైరల్! | 5 | 6 | 12-07-2026 |
| 10 | Сын Гандольфини снимется с Дэймоном в фильме от режиссеров «Все везде и сразу» | 0 | 5 | 26-06-2026 |